గద్దర్‌ విగ్రహాన్ని ట్యాంక్‌ బండ్‌పై ఏర్పాటు చేయాలి

నవతెలంగాణ-కోహెడ
ప్రజా యుద్ధ నౌక గద్దర్‌ విగ్రహాన్ని హైద్రాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేయాలని అఖిల భారత యువజన సమైక్య జిల్లా సహాయక కార్యదర్శి చింతకింది కుమార్‌ అన్నారు. బుధవారం మండలంలోని సముద్రాల గ్రామంలో విలేకరులతో మాట్లాడుతూ గద్దర్‌ మృతి ప్రజలకు తీరని లోటని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం తెలంగాణ ఉద్యమాలు ఆటపాటలతో కీలకపాత్ర పోషించారని, రాష్ట్ర ప్రభుత్వం ప్రజా యుద్ధనౌక గద్దర్‌ విగ్రహాన్ని హైదరాబాద్‌ ట్యాంక్‌ బండ్‌పై ఏర్పాటు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.