– మాల మహానాడు జాతీయ కార్యదర్శి రాగుల రాములు
నవతెలంగాణ – సిరిసిల్ల
అకాల మరణం చెందిన గద్దర్ నక్సలైటు కాదని ఉద్యమకారుడు అని మాల మహానాడు జాతీయ కార్యదర్శి రాగుల రాములు అన్నారు. సిరిసిల్లలోని మంగళవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గద్దర్ నక్సలైట్ అనేక మందిని చంపించాడు అనే మాటను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మాట్లాడడం సరైనది కాదని వెంటనే వెనక్కి తీసుకోవాలని రాములు అన్నారు. బండి సంజయ్ కేంద్ర మంత్రి అనేది మరిచిపోయి కార్పొరేటర్ గా వ్యవహరిస్తున్నారని, పీడిత ప్రజల కోసం గద్దర్ ఉద్యమం నడిపాడని, ఆయన మరణించిన రోజున భారత ప్రధానమంత్రి మోడీ తన సంతాపంలో తెలిపిన విషయం నీకు గుర్తుకు లేదా బండి సంజయ్ అని రాములు ప్రశ్నించాడు. బీసీల రిజర్వేషన్ కోసం గద్దర్ గజ్జ కట్టి ఉద్యమం చేశాడని, అటువంటి వ్యక్తిపై నీవు చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, లేనట్లయితే జనవరి 31 తర్వాత రాష్ట్రవ్యాప్తంగా దళిత సంఘాలు నిరసనలు తెలుపుతాయని పేర్కొన్నారు. బిజెపి ప్రభుత్వం ఉన్న రాష్ట్రాల్లో నుంచి దళితులను బహిష్కరించడంతోనే నక్సలైట్లు పుట్టారని, మంద కృష్ణకు పద్మశ్రీ ఇవ్వడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. సమావేశంలో మాల మహానాడు జిల్లా కన్వీనర్ వంకాయల భూమయ్య, బూర బాలు తదితరులు పాల్గొన్నారు.