గద్దర్ పై బండి సంజయ్వ్యాఖ్యలు సరికాదు..

Bandi's comments on Gaddar are not correct..నవతెలంగాణ – మల్హర్ రావు
కరీంనగర్ ఎంపీ,కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ ప్రజా యుద్ధ నౌక గద్దర్ పై అనుచిత వ్యాఖ్యలు సరికాదని అట్టి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లుగా మాల మహానాడు మండల కమిటీ అధ్యక్షుడు పసుల పోచయ్య తెలిపారు బుధవారం మండలంలోని కొయ్యుర్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు సంజయ్ మాటలు కోడిగుడ్డు మీద ఈకలు మొలిచే విధంగా ఉన్నాయని,గద్దర్ కు పద్మశ్రీ అవార్డు ఇవ్వమని, వామపక్ష తీవ్రవాదని అనడం దుర్మార్గపు చర్యన్నారు.ప్రజా పోరాట నిర్మాణంపై. ప్రజా చైతన్యంపై ఎలాంటి అవగాహన లేదన్న బాధ్యత రాహిత  వాగ్దానంగానే. ప్రజానీకం పరిగణిమించుకోవాలన్నారు. గద్దర్ యవ్వనం నుండి ప్రజా పక్షం వైపు నిలబడి నగారిన వర్గాల కొరకు. భూస్వామి వ్యతిరేక పోరాటం దళిత  ఉద్యమాలు. పెట్టుబడి దారికి వ్యతిరేకంగా పోరాటాలు. బానిసత్వపు వ్యతిరేక ఉద్యమాలు చేసిన ఘనత అమనదేన్నారు. స్త్రీ ఉద్యమాలు మొన్నటికి మొన్న వెన్నులో తూటాలు పెట్టుకొని తెలంగాణ నిర్మాణం అయ్యేంతవరకు. తనదైన శైలిలో ప్రజా ఉద్యమాలు నిర్మించి. ఐక్యత పరిచిన దశ దిశ ఉద్యమశాలిని ఈ విధంగా అవమానపరచడం. సమంజసం కాదన్నారు. తెలంగాణ ఉద్యమంలో బండి సంజయ్ పాత్ర. గద్దర్ అన్న మధ్య నక్కకు నాగలోకానికి ఉన్న సందర్భం గానే ఉన్నదన్నారు.ఇప్పటికైనా మేధావులు కార్మికులు కర్షకులు విద్యార్థులు. మొదలగు తెలంగాణ ప్రజానీకమంతా.వ్యతిరేకించాలని, బండి సంజయ్ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా కో కన్వీనర్ గడ్డం ముత్తయ్య,మండల కో కన్వీనర్ వేల్పుల పోచయ్య, గడ్డం పోచయ్య, నారా రాజేష్ ఎడ్ల సమ్మయ్య,బిఆర్ఎస్ నాయకుడు తాజాద్దీన్ పాల్గొన్నారు.