ఆగస్టు1న గద్దర్ వర్ధంతి సభ విజయవంతం చేయాలనీ సీపీఐ(ఎం) పార్టి రైతు సంఘం జిల్లా కార్యదర్శి జంగం అంజయ్య పిలుపు నిచ్చారు. వీర్నపల్లి మండలం కేంద్రంలో సీపీఐ(ఎం) పార్టీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి జంగం అంజయ్య ఆధ్వర్యంలో ప్రజా యుద్ద నౌక గద్దర్ ప్రథమ వర్ధంతి సభ వాల్ పోస్టర్ ను మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతు ఆగస్టు 1 న ప్రజా యుద్ద నౌక గద్దర్ అన్న అమరత్వం పొంది .ఆగస్టు 6 2024 నాటికి సంవత్సరం కాలం అవుతుంది . గద్దర్ అన్నను స్మరించుకోవడానికి ఆగస్టు ఒకటి నాడు సిరిసిల్ల పట్టణం వాసవి కళ్యాణ మండపంలో గద్దర్ అన్న ప్రథమ వర్ధంతి సభను ప్రజా సంఘాలు నిర్వహిస్తున్నాయి. ఈ సభకు పెద్ద ఎత్తున నాయకులు అభిమానులు తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు.