నవతెలంగాణ – ఆర్మూర్
చిన్ననాటి నుంచి క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని డివిజన్ విశ్వకర్మ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు గద్దె గంగాధర్ అన్నారు .. పట్టణంలోని విశ్వబ్రాహ్మణ సంఘ భవనంలో శనివారం పదవ తరగతిలో అత్యధిక మార్పులు సాధించిన విద్యార్థిని విద్యార్థులకు శాలువా,, మేమెంటో,,సిల్వర్ మెడల్, ప్రశంసా పత్రంతో,సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై భాస్కరాచారి, ఎమ్మార్వో నాగార్జున, జిల్లా అధికారి ని పద్మ లు మాట్లాడుతూ పిల్లలు బాగా చదవాలని ,మంచి ఉద్యోగం సాధించాలని కోరారు, బాగా చదివి ఉన్నతమైన స్థానంలో ఉండి తల్లిదండ్రుల పేరు నిలపాలని పిల్లలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో వేవ కార్యవర్గ సభ్యులు సత్యనారాయణ, ఉప్పల నటరాజ్, రాజారాం, లక్ష్మి నారాయణ, శ్రీనివాస్, వెంకటరమణ, నాగరాజు, గంగాధర్, శివాజి, రవీంద్ర, శంకర్ వేవా కార్యవర్గ సభ్యులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.