
విద్యుత్ షాక్‌తో గేదె మృతిచెందిన సంఘటన మండలం లో బుధవారం చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండల లోని పల్తీ తండా కు చెందిన పాల్తీలాలు కు చెందిన రైతు ఫామాయిల్ తోటలో కట్టేసిన గేదే సాయంత్రం తెంచుకొని మేసుకుంటూ పోయి అక్కడ పంట చేనులో ఉన్న ట్రాన్స్ ఫార్మర్ దగ్గర విద్యుత్ వైరుకు తగిలి అక్కడి కక్కడే మృతి చెందినది.గేదే విలువ సుమారు 55,000 లు ఉంటుందని బాధితుడు తెలిపారు.గేదే పాలతో కుటుంబాన్ని పోషించు కుంటున్న రైతు గేదే మృతి చెందడం తో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.కావున ప్రభుత్వం తమను ఆడుకోవాలని కుటుంబ సభ్యులు వేడుకంటున్నారు.