
శనివారం జిల్లా ఒలింపిక్ సంఘ అధ్యక్షులు ఈగ సంజీవ రెడ్డి స్వగృహం లో జిల్లా సెపక్ తక్రా ప్రధాన కార్యదర్శి జిల్లా ఒలింపిక్ అస్సోసియేటెడ్ ఉపాధ్యక్షులు గాధరి సంజీవరెడ్డి జన్మదిన సందర్బంగా జిల్లా ఒలింపిక్ సంఘము అధ్యక్ష, కార్యదర్శులు ఈగ సంజీవరెడ్డి, బొబ్బిలి నర్సయ్య సెపక్ తక్రా రాష్ట్ర అధ్యక్షులు నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈసందర్బంగా జిల్లా ఒలింపిక్ సంఘ అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ.. ఆయురారోగ్యలతో బాగుండాలని సెపక్ తక్రా మరియు వాలీబాల్ కు సంజీవరెడ్డి చేస్తున్న సేవలను కొనియాడారు. మున్ముందు కూడా క్రీడాకారుల అభివృద్ధి కి కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమం లో జిల్లా డి సి సి బ్యాంక్ డైరెక్టర్ చంద్ర శేకర్ రెడ్డి, ఈగ నర్సారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, బాల్ రెడ్డి, మార్టిన్, కబడ్డీ కోచ్ మీసాల ప్రశాంత్ కుమార్,మోపాల్ ఎంపీటీసీ ముత్తెన్న, గోపాలరెడ్డి, సయ్యద్, నవనీత్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.