భిన్న కథతో గగన మార్గన్‌

Gagana Margan with a different storyఎప్పటికప్పుడు వైవిధ్యమైన సినిమాలు, పాత్రలతో అలరిస్తున్న విజరు ఆంటోని ఈసారి డిటెక్టివ్‌ ఫిక్షన్‌ ప్రపంచంలోకి తీసుకెళ్లేందుకు గ్రిప్పింగ్‌ మర్డర్‌ మిస్టరీ-క్రైమ్‌ థ్రిల్లర్‌తో రాబోతున్నారు. విజరు ఆంటోని ఫిలింస్‌ కార్పొరేషన్‌ బ్యానర్‌పై మీరా విజరు ఆంటోని నిర్మిస్తున్నారు. ఈ మూవీ టైటిల్‌ను తాజాగా రివీల్‌ చేశారు. ‘గగన మార్గన్‌’ అంటూ రిలీజ్‌ చేసిన టైటిల్‌ పోస్టర్‌ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌లో విజరు ఆంటోని రెండు రకాలుగా కనిపించడం విశేషం. ‘అట్టకత్తి’, ‘బీడ’, ‘సూదు కవ్వుం’, ‘ఏ1’, ‘మాయవన్‌’ వంటి చిత్రాలకు ఎడిటర్‌గా మంచి పేరు తెచ్చుకున్న లియో జాన్‌ పాల్‌ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని త్వరలోనే థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.