బీజేపీలోకి గాలి జనార్థన్‌ రెడ్డి

బెంగళూరు : మైనింగ్‌ వ్యాపారి, గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్థన్‌రెడ్డి సోమవారం బీజేపీ లో చేరారు. తన సొంత పార్టీ కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష (కెఆర్‌పిపి)ను బీజేపీ లో విలీనం చేశారు. బెంగళూరులో యెడ్యూరప్ప సమక్షంలో జనార్థన్‌ రెడ్డి తన భార్య అరుణ లక్ష్మి, ఇతర మద్దతుదారులతో కలిసి బీజేపీ లో చేరారు. ఎలాంటి షరతులు లేకుండా తన పార్టీని బిజెపిలో విలీనం చేస్తున్నానని, ఒక సాధారణ కార్యకర్తగా పని చేస్తానని ఈ సందర్భంగా గాలి జనార్థన్‌ రెడ్డి తెలిపారు. నిజానికి గాలి జనార్థన్‌ రెడ్డి బీజేపీ కి చెందిన వ్యక్తే. అయితే గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆ పారీని వీడి సొంతంగా పార్టీ పెట్టుకున్నారు. ఎమ్మెల్యేగా గెలిచారు. మళ్లీ ఇప్పుడు బీజేపీ లోనే చేరారు.