– సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్‌రెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేట
కార్మికులకు అండగా నిలిచిన గాలి వెంకటయ్య మరణం కార్మిక ఉద్యమానికి తీరని లోటని, ఆయన జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్‌రెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక సూర్యాపేట ఫంక్షన్‌హాల్‌లో సీపీఐ సీనియర్ నాయకులు గాలి వెంకటయ్య సంతాపసభలో ఆయన మాట్లాడారు.పట్టణంలో రిక్షా కార్మికుల హక్కుల సాధన కోసం గాలి వెంకటయ్య చేసిన కషి మరువలేనిదన్నారు.చని పోయేంత వరకు నీతిగా, నిజాయతీగా నిడారంబర జీవితాన్ని గడిపారని కొనియాడారు. ఎంతోమంది పుట్టడం గిట్టడం జరుగుతుందని, కొద్దిమంది మాత్రమే చనిపోయిన ప్రజల హదయాలలో చిరస్థాయిగా నిలిచి ఉంటారని వారే కమ్యూనిస్టులని అన్నారు.కార్మికుల సమస్యలపై నిరంతరం గలమెత్తేది కమ్యూనిస్టులు మాత్రమేనని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎన్ని ఆటుపోట్లు వచ్చినా కడ వరకు కష్టజీవుల పక్షాన నిలబడేది ఎర్రజెండా మాత్రమేనన్నారు.ఓట్లు సీట్లు రాకున్నా ప్రజా సమస్యలే ఎజెండాగా పోరాడేది కమ్యూనిస్టులేనని తెలిపారు. గాలి వెంకటయ్య చూపిన మార్గంలో ప్రతి కమ్యూనిస్టు కార్యకర్త కష్ట జీవుల రాజ్యం కోసం కషి చేసినప్పుడే గాలి వెంకటయ్య లాంటి అనేకమంది అమర వీరులకు నివాళులర్పించిన వారమవుతామన్నారు.సీపీఐ జిల్లా నాయకులు దంతాల రాంబాబు అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎల్లావుల రాములు, మాజీ మున్సిపల్ చైర్మెన్ జుట్టుకొండ సత్యనారాయణ,ఎంసీపీఐయూ జిల్లా కార్యదర్శి షేక్ నజీర్, బహుజన కమ్యూనిస్టు పార్టీ జిల్లా కార్యదర్శి చామకూరినర్సయ్య, సీపీఐఎంఎల్ రామచంద్రన్‌వర్గం రాష్ట్ర అధికార ప్రతినిధి బుద్ధ సత్యనారాయణ, సీపీఐ పట్టణ కార్యదర్శి బూర వెంకటేశ్వర్లు, ఖమ్మంపాటి అంతయ్య, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరిరావు, సీనియర్ జర్నలిస్ట్ డేగల జనార్దన్, బాణాల విజరుకుమార్, మట్టిపల్లి సైదులు, జిల్లాపల్లి నర్సింహారావు, ఖమ్మంపాటి రాము, శ్రావణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.