
నవతెలంగాణ – రామారెడ్డి
మండలంలో అన్నారం, స్కూల్ తండా, బట్టు తాండ, జగదాంబ తండా తోపాటు గొడుగు మర్రి తాండ పరిధిలో శుక్రవారం గాలివాన బీభత్సవానికి స్కూల్ తండాలో ఇంటి పైకప్పులు నేల కులాయి. తూంపల్లి- కామారెడ్డి రోడ్డుపై చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. విద్యుత్ స్తంభాలు నేలకొరకడంతో విద్యుత్ తీగ రహదారిపై, నివాస ఇండ్లపై నుండి పడ్డాయి. విద్యుత్ సరఫరా లేకపోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.