గంప గోవర్ధన్ జన్మదినం సందర్భంగా పండ్ల పంపిణీ ..

Fruit distribution on the occasion of Gampa Govardhan's birthday..నవతెలంగాణ –  కామారెడ్డి
కామారెడ్డి జిల్లా కామారెడ్డి పట్టణం మున్సిపల్ పరిధిలో ప్రభుత్వ ఆస్పత్రిలో  మాజీ ఎంఎల్ఏ గంప గోవర్ధన్  జన్మదిన సందర్భంగా కామారెడ్డి బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యం లో పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కామారెడ్డి ని గత పదేండ్లలో  లో గంప గోవర్ధన్  చేసిన అభివృద్ధిని గుర్తుచేశారు. ప్రజలకు ఎల్లపుడు అండగా ఉండే గంప గోవర్ధన్  ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలన్నారు. ఈ కార్యక్రమం లో యూత్ నాయకులు పరుశురాం గౌడ్, ప్రభాకర్ రెడ్డి,  ప్రశాంత్ గౌడ్, శ్రీను, ఆనంద్, సాయిచరణ్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.