సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: గణపాక సుధాకర్

నవతెలంగాణ – గోవిందరావుపేట
దళితుల సమస్యలను మంత్రి సీతక్క దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి గనపాక సుధాకర్ అన్నారు. ఆదివారం మండలంలోని చల్వాయి గ్రామం గౌరారం గడ్డ ఎస్సీ దళితవాడలో దళితులతో సుధాకర్ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. ఆర్థికంగా దళితులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను ఉపాధి పరంగా ఆదుకునేందుకు మంత్రి సీతక్క దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం దిశగా తన వంతు కృషి చేస్తానని సుధాకర్ అన్నారు. మీయొక్క స్థానిక అవసరాలు జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ పటేల్  కి తెలియజేసి మీయొక్క అవసరాలు తీర్చే ప్రయత్నం కూడా చేస్తానని  అన్నారు.అదే విదంగా రానున్న నెలరోజుల్లో ఎంపీ పార్లమెంటరీ ఎన్నికలు వస్తున్నాయి మన కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్తిని అధిక ఓట్ల మెజారిటీతో గెలిపించాలని వారిని కోరారు.అంతే కాకుండా మన దేశానికి రాహుల్ గాంధీ ని ప్రధాన మంత్రిని చేసే వరకు ఊరు వాడ అందరు ప్రచారం చేయాలని కోరారు. యువ ప్రధాని దేశాన్ని అభివృద్ధి చేసి పేదప్రజలకు సబ్బండాజాతులకు ఆర్ధిక ప్రయోజనాలు చేకూరుతాయని అన్నారు.దేశంలో ఉద్యోగం, ఉపాధి, సంక్షేమం, పేదప్రజలయొక్క అభివృద్ధి, విద్య, వైద్యం దేశాప్రజలందరికి చేరాలంటే రాహుల్ గాంధీ  దేశప్రధాని కావాలి. అని కోరారు. ఈకార్యక్రమంలో సీనియర్ నాయకులు చుక్క కొమురయ్య, గజ్జల రాకేష్, జాగటి సతీష్, జాగటి కృష్ణ, కన్నం ఎల్లేష్, మేడ మహేష్, గజ్జల శివ, ఎర్రబెల్లి రమేష్, పసులది నిమేష్, ఇల్లందుల నారాయణ, ఇల్లందుల శేఖర్, గంగరపు ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.