త్వరలో రాబోతున్న వినాయక చవితి పండగ సంబురాలు బాలయ్య అభిమానులకు ఈ బుధవారంతోనే స్టార్ట్ అయ్యాయి. బాలయ్య తాజా చిత్రం ‘భగవంత్ కేసరి’లోని గణేష్ ఆంథమ్ ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. గణపతి బప్ప మోరియా అంటూ సాగే గణేష్ ఆంథమ్ గూస్‌బంప్స్ తెప్పిస్తుంది. ఈపాట ప్రోమోలో బాలకష్ణ, శ్రీలీల.. బాబారు, అమ్మాయిగా కనిపించారు. అలాగే బిడ్డా ఆన్తలేదు.. సప్పుడు గట్టిగా చేయమను అని బాలయ్య అన్నదానికి శ్రీలీల సైతం మా చిచ్చా ఒచ్చిండు కొట్టర కొట్టు అంటూ ఊరమాస్ లెవల్లో డైలాగ్ చెప్పింది. దర్శకుడు అనిల్ రావిపూడి ప్రతి సినిమాలో ఒక యూనిక్ పాయింట్ ఉంటుంది. తమన్ సంగీతం అందించిన ఈ పాటను సెప్టెంబర్ 1న రిలీజ్ చేయనున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 19న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.