
మండలంలోని ఫార్డి బి గ్రామంలో ని ఎల్బీఎం పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు చిరంజీవి పర్యావరణ పరిరక్షణ ను కాపాడాలని ఉదేశ్యంతో శనివారం గణేష్ నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా పసుపు తో కూడిన గణేష్ విగ్రహాన్ని తయారు చేసి పాఠశాలలో ప్రతిష్టించడం జరిగింది. దింతో గ్రామంలో ఉన్న ప్రజలు యువకులు, విద్యార్థులు ఎంతో ఆసక్తిగా గణేశునికి దర్శించుకోవడం జరిగింది. అదే విదగా ప్లాస్టర్ ఎఫ్ ప్యారిస్ వల్ల అనేక విధాలుగా నష్టం జరుగుతున్న సందర్భంగా కొన్ని గ్రామాల్లో కర్ర వినాయకుడిని తయారు చేసి పూజలు చేయడం జరుగుతుంది. ఫార్డి బి గ్రామంలో పల్సి,కుభీర్ విటలేశ్వర్ ఆలయంలో కర్ర వినాయకుని ప్రతిష్టించి పూజలు చేశారు. 9రోజుల పాటు పూజలు చేసి చివరి రోజున వగులోకి వెళ్లి నీళ్లు చల్లుకుని మళ్ళీ తీసుకువస్తారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రదనోపాధ్యాయులు వెంకటేశ్వర మాట్లాుతూ.. పసుపుతో తయారు చేసిన గణేష్ విగ్రహం కొత్త ప్రయత్నం పర్యావరణ కాలుష్యం నియంత్రించేందుకు శయపడుతుందాన్ని అన్నారు.