గణనాధుని ఆశీర్వాదం ప్రజలందరిపై ఉండాలి

– బిఆర్ఎస్ పార్టీలో చేరిన మహిళలు 
– హుస్నాబాద్ లో ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే సతీష్ కుమార్
నవతెలంగాణ- హుస్నాబాద్ రూరల్ 
హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజల పై గణనాధుని ఆశీర్వాదం ఉండి ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని  హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ అన్నారు. ఆదివారం హుస్నాబాద్, మండలంలోని మీర్జాపూర్ గ్రామంలో ఎమ్మెల్యే సతీష్ కుమార్ పర్యటించారు. మీర్జాపూర్ గ్రామంలోని హనుమాన్ దేవాలయాన్ని సొంత నిధులతో నిర్మాణం చేపడుతున్నారు. ఆలయంలోని వినాయక విగ్రహానికి ఎమ్మెల్యే సతీష్ కుమార్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గణనాథుని వద్ద చేపట్టిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.
బిఆర్ఎస్ లో చేరిన మహిళలు 
మీర్జాపూర్ గ్రామానికి చెందిన మహిళలు వివిధ పార్టీల నుండి ఎమ్మెల్యే సతీష్ కుమార్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీ గులాబీ కండువా కప్పి బిఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులకు బి అర్ ఎస్ పార్టీలో చేరుతున్నట్లు మహిళలు పేర్కొన్నారు.
ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే సతీష్ కుమార్ 

హుస్నాబాద్ పట్టణంలోని నాగారం రోడ్ లో ని వినాయక మండపం, నెహ్రూ చౌక్ వద్ద స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో, మార్కండేయ దేవాలయంలో పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో, వైశ్య భవన్ లో పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో, 4వ వార్డులో యువకులు నెలకొల్పిన వినాయకుడిని,10వ వార్డులో గణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నెలకొల్చిన వినాయకుని దర్శించుకుని ఎమ్మెల్యే సతీష్ కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.ప్రతి మంటపం వద్ద చిన్నారులు, యువకులు, మహిళలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని మంగళ హారతులతో డప్పుచప్పులతో ఎమ్మెల్యే సతీష్ కుమార్ కు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ లోకమాన్య బాలగంగాధర్ తిలక్ 1892లో మహారాష్ట్రలో గణపతి నవరాత్రి ఉత్సవాలను జాతీయ సమైక్య పండుగగా ప్రారంభించారని అన్నారు. ఈ ఉత్సవాలు ప్రజలందరూ ఒక దగ్గర చేరి పేద ధనిక బేధం లేకుండా సామూహికంగా స్వతంత్ర కాలం నుండి చేసుకుంటున్నారని అన్నారు. ఇప్పుడు ప్రత్యేక తెలంగాణ పోరాటంలో కూడా గణపతి అలాగే దుర్గా నవరాత్రి ఉత్సవాలు ఎంతగానో ఉపయోగపడ్డాయని తెలిపారు .యువకులు, మహిళలు, ప్రజలందరూ ఒక దగ్గర చేరి ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని గురించి చర్చించుకుని ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించారని అన్నారు .అందరం కలిసి పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని ఎమ్మెల్యే గుర్తుచేసుకున్నారు ఆదిదేవుడు ఆ గణనాథుని ఆశీర్వాదం ప్రజలందరిపై ఉండాలని ప్రజలందరూ సుఖసంతోషాలతో భోగభాగ్యాలతో వర్ధిల్లాలని వినాయకుడిని కోరుకున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.