
మద్దిరాల మండల కేంద్రం రాయల్ కింగ్స్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం తిరుమలగిరి నవతెలంగాణ రిపోర్టర్ నెల్లుట్ల రాజు కుటుంబ సభ్యులతో ఘనంగా గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు అనంతరామశాస్త్రి స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేసి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా వారు కుటుంబ సభ్యులతో పాటు, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని గణనాథుడిని కోరుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు నెల్లుట్ల రమేష్ లింగమ్మ, నెల్లుట్ల కృష్ణ సుమలత, నెల్లుట్ల రాజు సునిత, నెల్లుట్ల నవీన్ స్వప్న, నెల్లుట్ల సాగర్ కావ్య, ఉదయ్, నటరాజ్, అఖిల్, నిఖిల్, నేహాశ్రీ, జశశ్విని, నివేదిత, రన్ వీర్,అమూల్య, యువాన్ష్, పునర్నవి కమిటీ సభ్యులు ఉపేందర్, గణేష్, శివ, తదితర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.