
గత తొమ్మిది రోజులుగా ఘనంగా పూజలు అందుకున్న గణనాథుడు ఆదివారం సాయంత్రం గాంధారి మండల కేంద్రంలో గణేష్ శోభాయాత్ర ప్రారంభమైంది గాంధారి మండల కేంద్రంలోని ప్రధాన వీధుల గుండా శోభాయాత్ర నిర్వహించారు. వివిధ గణేష్ మండపాల వారు ఏర్పాటు చేసిన గణనాథుల అలంకరణ ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. అలాగే యువకులు చిన్నారులు నృత్యాలు అందర్నీ ఆకట్టుకున్నాయి ముఖ్యంగా వివిధ గణేష్ మండల్లో వద్ద చిన్నారులు చేసిన నృత్యాలు అందర్నీ ఆకట్టుకున్నాయి. సోమవారం రాత్రి వరకు గణనాథుడు గంగమ్మ ఒడికి చేరుకున్నాడు గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా జరగడంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది.