గండ రిలీజ్‌కి రెడీ

జీరో బడ్జెట్‌తో వారణాశి సూర్య ఓ వినూత్న ప్రయోగానికి తెరతీస్తూ ఈజీ మూవీస్‌ బేనర్‌ పై ‘గండ’ చిత్రాన్ని డైరెక్ట్‌ చేస్తూ నిర్మించారు. ఈ చిత్రం ఈ నెల 30న విడుదలకు సిద్ధమైంది.
ఈ సందర్భంగా బుధవారం ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్‌ వేడుకలో వారణాశి సూర్య మాట్లాడుతూ, ‘ఈ సినిమాతో ఎంతో మంది టాలెంటెడ్‌ ఆర్టిస్ట్స్‌, టెక్నీషియన్స్‌ ఇండిస్టీకి పరిచయం అవుతున్నారు. ఈ చిత్రాన్ని 22 థియేటర్స్‌లో రిలీజ్‌ చేయబోతున్నా.
మా ఈజీ మూవీస్‌ సంస్థ త్వరలో ఓ పెద్ద సంస్థతో కలిసి పెద్ద ప్రాజెక్ట్స్‌ చేయబోతుంది. అలాగే విజరు జెడ అనే దర్శకుణ్ని పరిచయం చేస్తూ మా సంస్థలో మరో జీరోబడ్జెట్‌ సినిమా చేయబోతున్నాం.
చిన్న సినిమాలు పలు కారణాల వల్ల విడుదలకు నోచుకోక ల్యాబ్‌ల్లోనే ఉండ పోయాయి. అలాంటి సినిమా లను టేకప్‌ చేసి, వాటికున్న సమస్యలను సాల్వ్‌ చేసి, కంటెంట్‌ ఉన్న సినిమాలను రిలీజ్‌ చేయాలన్న ఆలోచనలో కూడా ఉన్నాం. దానికి సంబంధించిన పనులు కూడా జరుగుతున్నాయి. అలాగే కోట్లు పెట్టి పోగొట్టుకున్న చిన్న నిర్మాతలు కేవలం పింఛన్‌ మీద ఆధారపడి బతుకు తున్న వారున్నారు. అలాంటి వారికి మా సంస్థలో వచ్చే మనీతో కొంత సాయం చేయాలని సంకల్పించాం. మా ‘గండ’ సినిమా తప్పక అలరిస్తుంది’ అని తెలిపారు.