దళితబందులో గోసంగిలకు ప్రాధాన్యత ఇవ్వాలి: గంధం రాజేష్

నవతెలంగాణ-  నవీపేట్: దళిత బంధు పథకంలో గోసంగి లకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కోసంగి సంఘం అధ్యక్షులు గంధం రాజేష్ అన్నారు. మండల కేంద్రంలోని లిటిల్ ఫ్లవర్ హైస్కూల్ లో ఏర్పాటు చేసిన నవిపేట్ పట్టణ గొసంగి సంఘం నూతన కమిటీ ప్రమాణ స్వీకార సభకు ముఖ్య అతిధిగా జిల్లా అధ్యక్షులు గంధం రాజేష్ హాజరై మాట్లాడుతూ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గోసంగి కులస్తులు ఏళ్లనాటి నుండి కళారూపాలతో వివిధ వేషధారణలతో బిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఎస్సి కులానికి చెందిన వీరికి ఎస్సి ఫలాలు అందడం లేదని అన్యాయానికి గురవుతున్నారని అవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో తమ కులవృత్తులు, వేషధారణలతో భాగస్వామ్యం అయి ఉద్యమ నాయకుడు కేసీఆర్ కి మద్దతుగా నిలిచామని గంపెడు ఆశలతో సాధించుకున్న ప్రత్యేక తెలంగాణలో మా కులస్తుల జీవితాలు బాగుపడతాయని ఆశించామని కానీ రెండు పర్యాయాలు కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్యేలతో కలిసి పార్టీ గెలుపుకై మా కుల సంఘాలన్ని ఏకగ్రీవ తీర్మానాలు చేసి ప్రభుత్వ ఏర్పాటులో భాగస్వామ్యం అయ్యమని అయినప్పటికీ గోసంగిలకు పార్టీలో గౌరవం లభించడంలేదని, సంక్షేమ పథకాల్లో, పదవుల్లో తీరని అన్యాయం జరిగిందని అన్నారు.గోసంగిల వెనుకబాటుకు ప్రభుత్వమే కారణమని సిఎం కేసీఆర్ స్పందించి ఆదుకోవాలని అన్నారు.ఎస్సి లో 57 ఉపకులాలు దయనియ స్థితిలో తమ ఉనికిని కోల్పోతున్నాయని అందులో గోసంగి కులం కూడా ఒకటని నిజంగా మాపై చిత్తశుద్ధి ఉంటే గోసంగిలకు గౌరవ ప్రదమైన నామినేటెడ్ పదవులు కేటాయించాలని, నిజమాబాద్ జిల్లాలో గోసంగి ఆత్మగౌరవ భవనానికి ఒక ఎకరం భూమితో పాటు నిర్మాణానికి కోటి రూపాయల నిధులు కేటాయించాలని, ప్రతి నియోజకవర్గంలో 200కు తగ్గకుండా దలితబందు పథకాలు, డబుల్ బెడ్ రూమ్ లను గోసంగిలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సి ఉప కులాల హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు నిరగొండ బుచ్చన్న,గోసంగి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు ఈర్నాల లక్ష్మణ్, జిల్లా కోశాధికారి ఈర్నాల వెంకటరమణ, కళ్లెం గంగాధర్, బోధన్ నియోజకవర్గ అధ్యక్షులు కొండపల్లి గంగాధర్ ,జి.వై.ఎస్ నాయకులు రెవల్లి సాయిలు తదితరులు పాల్గొన్నారు.నవిపేట్ పట్టణ కమిటీ అధ్యక్షులు గా ఈర్నాల రాములు, ప్రధానకార్యదర్శి గంధం అశోక్, ఉపాధ్యక్షులు కొండపల్లి శంకర్, కోశాధికారి కళ్లెం గంగాధర్, సంయుక్త కార్యదర్శి ఇర్నాల చిన్న సాయిలు, ప్రచార కార్యదర్శి ఇర్నాల సత్యనారాయణ, ముఖ్య సలహాదారులు ఈ.ఎం.గంగాధర్, ఈ. సాయిలు, గంధం శ్రీనివాస్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.