శిల్పారామంలో గాంధీ బుణాకర్‌ మేళా

నవతెలంగాణ-శేరిలింగంపల్లి
మాదాపూర్‌లోని శిల్పారామంలో నేషనల్‌ హ్యాండ్లూమ్‌ ఎక్స్‌ పో గాంధీ బుణాకర్‌ మేళని స్పెషల్‌ ఆఫీసర్‌ జి.కిషన్‌ రావు ప్రారంభిం చారు. వీవెర్స్‌ సర్వీస్‌ సెంటర్‌ ఆఫీస్‌ హెడ్‌ అరుణ్‌ కుమార్‌, మేనేజర్‌ అంజయ్యలు పాల్గొని ప్రారంభించారు. డెవలప్మెంట్‌ కమిషనర్‌ హ్యాం డ్లూమ్స్‌, మినిస్ట్రీ అఫ్‌ టెక్స్టైల్స్‌, గవర్నమెంట్‌ అఫ్‌ ఇండియా వారి సంయుక్త నిర్వహణలో వివిధ రాష్ట్రాలనుండి చేనేత హస్తకళా, ఖాదీ ఉత్పత్తులు దాదాపుగా ఎనభై స్టాల్ల్స్‌ సందర్శకుల కోసం ఏర్పాటు చేశా రు. ఉప్పాడ, పోచంపల్లి, గద్వాల్‌, గొల్లభామ, బెంగళూరు సిల్క్‌, ఝాము దని, కొస పట్టు, బనారసీ పట్టు, ఖాదీ షర్ట్స్‌,, ఖాదీ మెటీరియల్‌, తనేరి యా, కాటన్‌, తస్సార్‌ పట్టు, కాటన్‌, బెడఉషీట్స్‌, మొదలైన ఉత్పత్తులు సందర్శకులకు అందుబాటులో ఉన్నాయి.