ఘనంగా జాతిపిత గాంధీ వర్థంతి వేడుకలు..

Grand death anniversary celebrations of Father of Nation Gandhi..నవతెలంగాణ – మల్హర్ రావు
జాతిపిత మహాత్మాగాంధీ వర్థంతి వేడుకలు మండల కేంద్రమైన తాడిచెర్లలో  వాసవి క్లబ్,వైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మండల పరిషత్ కార్యాలయం ముందున్న గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం చిన్నారులకు, పేదలకు పండ్లు, స్వీట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైశ్య సంఘము అధ్యక్షుడు కుక్కడపు వెంకటేశ్వర్లు, రేపాల ఆంజనేయులు, హరీష్, కుక్కడపు అశోక్, సత్యనారాయణ, కోడీమ్యాల భాస్కర్, యంసాని రమేష్, రాజు, ఓల్లాల నాగరాజు, రమేష్, కాంగ్రెస్ నాయకుడు బండి స్వామి, ప్రజలు పాల్గొన్నారు.