ధర్మాజీపేటలో గాంధీ జయంతి వేడుకలు

Gandhi Jayanti celebrations in Dharmajipetనవతెలంగాణ – దుబ్బాక
సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ పరిధిలోని ధర్మాజీపేట వార్డులో గాంధీజీ జయంతి వేడుకలను 7, 8 ,9 వార్డుల కౌన్సిలర్లు దివిటి కనకయ్య, దుబ్బాక బాలకృష్ణ గౌడ్, బత్తుల స్వామి ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. ముఖ్యఅతిథిగా మున్సిపల్ చైర్ పర్సన్ గన్నె వనిత భూమిరెడ్డి హాజరైనారు. వార్డులో నూతనంగా ఏర్పాటు చేసిన గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం పూలమాలవేసి స్మరించుకున్నారు. అంతకుముందు దుబ్బాక పట్టణ కేంద్రంలోని గాంధీ విగ్రహానికి మున్సిపల్ కమిషనర్ కే.రమేష్ కుమార్ తో కలిసి చైర్ పర్సన్ గన్నె  వనిత భూమిరెడ్డి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కే.రమేష్ కుమార్, మున్సిపల్ కో ఆప్షన్ మెంబర్ పెంటమ్మ,ధర్మాజీపేట వార్డు ప్రజలు,పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.