
మద్నూర్ మండలంలోని అంతాపూర్ గ్రామంలో సోమవారం నాడు గాంధీ జయంతి వేడుకలు ఆ గ్రామ సర్పంచ్ సుగుణబాయి ఆ గ్రామ సర్పంచ్ ప్రమోద్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గ్రామపంచాయతీ ఆవరణంలో గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి టెంకాయ కొట్టి గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ సుగుణబాయి మాట్లాడుతూ భారతదేశానికి గాంధీమాత్ముడు అందించిన సేవలు గురించి కొనియాడారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ వార్డు సభ్యులు సర్పంచ్ కుమారుడు అధికార పార్టీ నాయకులు రాజు గ్రామస్తులు పాల్గొన్నారు.