– ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు
నవతెలంగాణ – చండూరు
ఏ ఆసరా లేని నిరుపేదలను ఆదుకోవడమే గాంధీజీ ఫౌండేషన్ ఆశయం అని ఫౌండేషన్ చైర్మన్, ట్రస్మా జిల్లా అధ్యక్షుడు, గాంధీజీ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాస్ లు తెలిపారు. శనివారం పద్నాలుగవ నెల సరుకుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా స్థానిక గాంధీజీ విద్యాలయంలో నిరుపేదలకు నిత్యవసరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు సంవత్సరముల వరకు ప్రతినెల 22 మంది నిరుపేదలకు ఒక్కొక్కరికి వెయ్యి రూపాయల విలువ చేసే నిత్యావసర సరుకుల పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. నిరుపేదలు చాలామంది మా ఫౌండేషన్ వద్దకు వచ్చి మాకు కూడా నిత్యావసర సరుకులు ఇవ్వాలని కోరుతున్నారని, వారి కోరిక మేరకు వచ్చేనెల నుండి పదిమంది నిరుపేదలను పెంచి మొత్తం 32 మంది నిరుపేదలకు నిత్యావసర సరుకులను అందిస్తామని తెలిపారు. దీనికోసం చండూరు మున్సిపాలిటీలో ఉన్న 50 సంవత్సరాలు పైబడి, కుమారులు, కూతుళ్లు లేకుండా ఉన్నటువంటి నిరుపేదలు గాంధీజీ విద్యాసంస్థల వద్దకు వచ్చి దరఖాస్తు చేసుకోగలరని తెలిపారు. మా జీవితం ఉన్నంతవరకు గాంధీజీ ఫౌండేషన్ ద్వారా నిరుపేదలకు ఉచిత నిత్యావసర సరుకుల పంపిణీ తో పాటు మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ, సమాజంలో ఆదర్శవంతంగా జీవిస్తామని, తెలిపారు.నిరుపేదల కండ్లల్లో ఆనందాన్ని చూడడమే గాంధీజీ ఫౌండేషన్ లక్ష్యమని అన్నారు. గాంధీజీ ఫౌండేషన్ పేదల పక్షపాతి అని, ప్రాణం ఉన్నంతవరకు నిరుపేదలకు సేవ చేస్తూనే ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో గాంధీజీ విద్యాసంస్థల డైరెక్టర్ సరికొండ వెంకన్న, ప్రిన్సిపాల్ సత్యనారాయణమూర్తి, పులిపాటి రాధిక, బోడ యాదయ్య, బుషిపాక యాదగిరి, బోడ విజయ్,గోపి తదితరులు పాల్గొన్నారు.