నవతెలంగాణ – చండూరు
ఏ ఆసరా లేని నిరుపేదలను ఆదుకోవడమే గాంధీజీ ఫౌండేషన్ ఆశయం అనీ ట్రస్మా జిల్లా అధ్యక్షుడు, గాంధీజీ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు తెలిపారు. గురువారం స్ధానిక గాంధీజీ విద్యాసంస్థలో మున్సిపల్ వైస్ చైర్మన్ దోటి సుజాత వెంకటేష్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ చండూరు మున్సిపాలిటీ అధ్యక్షులు అనంత చంద్రశేఖర్ లు 8వ నెల నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏ ఆసరా లేని నిరుపేదలను ఆదుకుంటున్న గాంధీజీ ఫౌండేషన్ ను అభినందించారు. భవిష్యత్తులో గాంధీజీ ఫౌండేషన్ పేదలకు మరిన్ని సేవలు చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గాంధీజీ ఫౌండేషన్ చైర్మన్, ట్రస్మా జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కోడి శ్రీనివాసులు, గాంధీజీ విద్యాసంస్థల డైరెక్టర్ సరికొండ వెంకన్న, ప్రిన్సిపల్స్ సత్యనారాయణమూర్తి, పాలకూరి కిరణ్, కృష్ణయ్య, ఆనంద్,వెంకటేశ్వర్లు, వెంకన్న, శివప్రసాద్, మణిశంకర్, లింగస్వామి, ఆంజనేయులు, నాగరాజు, బుషిపాక యాదగిరి, బోడ విజయ్, గోపి తదితరులు పాల్గొన్నారు.