ఎంపీపీ కార్యాలయంలో గాంధీజీ జయంతి వేడుకలు

నవతెలంగాణ -గోవిందరావుపేట:
మండల కేంద్రంలోని ఎంపీపీ కార్యాలయంలో సోమవారం మహాత్మా గాంధీజీ జయంతి వేడుకలు ఎంపీటీసీలు ఘనంగా నిర్వహించారు. గాంధీ జయంతిని పురస్కరించుకొని గాంధీజీ చిత్ర పటానికి పూల మాల అలంకరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అనంతరం మిఠాయిలు పంపిణీ చేయనైనది. ఈ కార్యక్రమము లో  ఎంపీటీసీ లు  చాపల ఉమాదేవి, ఎలిశాల స్వరూప, గోపిదాస్ ఏడుకొండలు, లావుడియా రాంచందర్ మరియు సూదిరెడ్డి లక్ష్మారెడ్డి లు పాల్గొన్నారు.