బూటకపు హామీల ప్రభుత్వాన్ని గాంధీజీ మేల్కొల్పాలి ..

Gandhiji should wake up the government of fake promises..– భూక్య జంపన్న బిఆర్ఎస్ పార్టీ  జిల్లా నాయకులు 
నవతెలంగాణ – గోవిందరావుపేట 
బుటకపు హామీలతో ఏర్పాటుచేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మహాత్మా గాంధీ మేల్కొల్పాలని వీఆర్ఎస్ పార్టీ ములుగు జిల్లా నాయకులు భూక్య జంపన్న అన్నారు. గురువారం మండల కేంద్రంలో బి ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు ములుగు జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు ఆదేశాలతో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీలు అమలు పరచాలని మహాత్మా గాంధీ చిత్రపటానికి వినతి పత్రం ఇచ్చే కార్యక్రమాన్ని మండల పార్టీ అధ్యక్షుడు లాకావత్ నరసింహ నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జంపన్న హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా జంపన్న మండల కమిటీ నాయకులతో కలిసి గాంధీ  చిత్రపటం ముందు మాట్లాడుతూ అయ్యా గాంధీ జీ ప్రజలకు బుటకపు హామీలు ఇచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన రేవంత్ రెడ్డి  వంద రోజులల్లో ఇచ్చిన హామీలు అన్ని నెరవేరుస్తా అని చెప్పి ఇప్పుడేమో పూటకో మాట గడియకో చేష్టలు చేస్తున్న రేవంత్ రెడ్డి  ఎలాగూ ప్రజల గోడు పట్టించుకోవడం లేదు.కావున గాంధీ కుటుంబానికి సన్నిహితులు ఐనా మీరు రేవంత్ రెడ్డి నీ మేల్కొలపే విధంగా చేసి ఇచ్చిన హామీలను త్వరగా నెరవేర్చవిధంగా చెయ్యాలని వినతిపత్రం సమర్పిస్తున్నామన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 420 హామీ పుస్తకాన్ని మండల నాయకులతో కలిసి భూక్య జంపన్న గారు ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ సూడి శ్రీనివాసరెడ్డి మాజీ ఎంపీటీసీలు స్వరూప, చందులాల్, ఎంపీటీసీ ఆలూరి శ్రీనివాసరావు, మండల ఉపాధ్యక్షులు చుక్క గట్టయ్య, మాజీ సర్పంచ్ భూక్యా దేవా, డాక్టర్. హేమాద్రి, రెన్ల శ్రీనివాస్, ఉద్యమ నాయకులు ఊట్ల మోహన్ ఎండి ఫకృద్దీన్, ఉపాధ్యక్షులు మల్లేష్ గౌడ్, K. ఇంద్రా రెడ్డి, తాటికొండ శ్రీనివాస్, P. శ్రీనివాస్ రెడ్డి, అజ్మీర బిక్కు మాలోత్ గాంధీ, G. వెంకన్న, రాజాలు,  సీనియర్ నాయకులు కొండి రమేష్, హనుము గారు, వెంకన్నగారు, గట్టు ధర్మయ్య,  నిమ్మగడ్డ శ్యామల్, పూర్ణ చందర్  జన్ను సుధాకర్, కంపాటి కృష్ణ, ఎండి బాబర్, పోరిక ఫణి కుమార్, వీరబోయిన రాజేందర్ ముదిరాజ్, కన్నెబోయిన విక్రమ్, ఎండి యూసుఫ్  తదితరులు పాల్గొన్నారు.