స్టేట్ మొదటి ర్యాంకులు సాధించిన గాంధీజీ విద్యార్థులు

– 10వ తరగతి ఫలితాల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన గాంధీజీ విద్యార్థులు 
నవతెలంగాణ – చండూరు  
మార్చి 2024 పదవ తరగతి ఫలితాలలో చండూరు మున్సిపల్ కేంద్రంలోని గాంధీజీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కు చెందిన ఐదుగురువిద్యార్థులు పి. ధృవిత,  కె.నిఖిల్ కుమార్, యం.చందన,  వి.రక్షిత,  బి.శ్రీ విద్య 10/10 గ్రేడ్ పాయింట్లతో స్టేట్ మొదటి ర్యాంక్ లను సాధించడంతో పాటు 100% ఉత్తీర్ణత సాధించారని గాంధీజీ విద్యాసంస్థల చైర్మన్, ట్రస్మా జిల్లా అధ్యక్షులు డాక్టర్ కోడి శ్రీనివాసులు తెలిపారు. స్టేట్ మొదటి ర్యాంకులు సాధించిన విద్యార్థులకు పాఠశాలలో జరిగిన అభినందన కార్యక్రమంలో శాలువాలు కప్పి, మెమొంటోలను అందించి అభినందించారు. ఈ విద్యార్థులందరు మంచి చదువులు చదివి, భవిష్యత్తులో ఉన్నత లక్ష్యాల వైపు పయనించాలని ఆశించారు. మంచి ఫలితాలు రావటానికి కృషి చేసిన ఉపాధ్యాయులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు.