నవతెలంగాణ – చండూరు
స్థానిక గాంధీజీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో రాఖీ పండుగ వేడుకలను శనివారం ఘనంగా జరుపుకున్నారు. విద్యార్థులు రాఖీ ఆకారంలో కూర్చొని రాష్ట్ర ప్రజలకు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. పాఠశాల బాలికలు బాలురకు రాఖీలు కట్టి, స్వీట్లు తినిపించారు. ఈ సందర్భంగా గాంధీజీ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు మాట్లాడుతూ అనుబంధాలను పంచుకునే పండుగ రక్షాబంధన్ అని, అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్ల అన్యోన్యతకు చిహ్నం ఈ పండుగని అన్నారు. రాఖీనాడు సోదరీమణులు తమ సోదరులకు చేతికి రాఖీ కట్టి, ఆశీర్వాదం పొందుతారని, తన చెల్లి లేదా అక్కకు సోదరులు కట్నం లేదా మంచి గిఫ్ట్ ఇస్తుంటారన్నారు. రాఖీ పండుగ అంటే అన్నాచెల్లెళ్లకు, అక్క తమ్ముళ్లకు చాలా ఇష్టమైన పండుగ అని అన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ సరికొండ వెంకన్న, ప్రిన్సిపాల్ సత్యనారాయణ మూర్తి, పులిపాటి రాధిక, కందుల కృష్ణయ్య, విజయ కుమారి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.