వాసవి క్లబ్ ఆద్వర్యంలో గాంధీ వర్ధంతి..

Gandhi's birthday under the auspices of Vasavi Club..నవతెలంగాణ – అశ్వారావుపేట
గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని పట్టణంలోని లోని గాంధీ బొమ్మ సెంటర్లో గల ఆయన విగ్రహానికి వాసవి క్లబ్ అద్యక్షులు సత్యవరపు బాలగంగాధర్ గురువారం పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం జిల్లా పూర్వ అద్యక్షులు శీమకుర్తి వెంకటేశ్వరావు, వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం అధ్యక్షులు ముత్తా సుమాకర్, వాసవి క్లబ్ రీజనల్ చైర్మన్ భోగవల్లి రాంబాబు, వాసవి క్లబ్ కార్యదర్శి సమయమంతుల మోహన గంగాధర్ రావు,కోశాధికారి రావి క్రింది కుమార్ రాజా, చార్టెడ్ ప్రెసిడెంట్ కోరుకొండ రామ్మోహన్ రావు, మాజీ అధ్యక్షులు జల్లిపల్లి దేవరాజు, వాసవి క్లబ్ జోన్ చైర్మన్ శీమకుర్తి సుబ్బారావు, ఆర్యవైశ్య సంఘం పట్టణ అధ్యక్షులు జల్లిపల్లి లోక నాథ్ గుప్తా, వాసవి క్లబ్ పట్టణ పూర్వ అద్యక్షులు సత్యవరపు సంపూర్ణ, ఆర్యవైశ్య సంఘం జిల్లా ట్రెజరర్ తాత శ్రీను, విశ్రాంతి ఉపాద్యాయుల ప్రకాష్ లు పాల్గొన్నారు.