
హుస్నాబాద్ పట్టణ కేంద్రంలో మంగళవారం మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత వెంకన్న ఆధ్వర్యంలో గాంధీ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత మాట్లాడుతూ..దేశ స్వాతంత్య్రానికి, తద్వారా జాతి నిర్మాణానికి మహాత్మా గాంధీ అందించిన అమూల్యమైన సేవలు, త్యాగాలు అందరికీ ఆదర్శనీయమన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ ఐలేని అనిత శ్రీనివాస్ రెడ్డి , కౌన్సిలర్లు బొజు రమా రవీందర్, కోమటి స్వర్ణలత, మ్యాదరబోయిన శ్రీను, మాజీ ఎంపీపీ ఆకుల వెంకన్న, ఐలేని శంకర్ రెడ్డి, యుండి ఆయూబ్, .కమిషనర్ ఎం రాజ్ కుమార్ , ఏ ఇ సాయి ప్రణీత్, ఆర్ ఐ కృష్ణ , సిహెచ్ బాల ఎల్లం, జాలిగాం శంకర్ ,సృజన్, శివ, పున్న సది, బోజు రవీందర్, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.