మండల కేంద్రంలో గాంధీ వర్ధంతి వేడుకలు

నవతెలంగాణ –  తాడ్వాయి

తాడ్వాయి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం రోజున మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని వేడుకలను ఘనంగా నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు కార్యకర్తలు జాతివిత మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ దేశానికి గాంధీ చేసిన సేవలను కొనియాడారు. గాంధీజీ సూచించిన శాంతి మార్గంలో యువత ముందుకు నడవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అంబిర్ శ్యాం రావు. ఆకిటి వెంకటరామిరెడ్డి. బాల్ కిషన్ రావు. జంగం రాజు. లక్ష్మణ్. జలంధర్ రెడ్డి. ఏనుగు నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.