నవతెలంగాణ – అశ్వారావుపేట
స్వాతంత్ర సమరయోధులు, జాతిపిత మహాత్మ గాంధీ వర్ధంతిని నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేటలో గురువారం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని గాంధీ సెంటర్ లో ఆయన విగ్రహానికి కాంగ్రెస్ సీనియర్ నాయకులు మొగళ్ళపు చెన్నకేశవ రావు నేతృత్వంలో పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ పూర్వ కో – ఆప్షన్ సభ్యులు ఎస్.కే పాషా,సత్యవరపు బాలగంగాధర్,తగరం రాజేష్,ముళ్ళగిరి క్రిష్ణ లు పాల్గొన్నారు.