కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుంటే ఇక యుద్ధమే అని బీఆర్ఎస్ఆర్మూర్ నియోజకవర్గ ఇన్చార్జి రాజేశ్వర్ రెడ్డి గురువారం డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఏర్పడి 420 రోజులవుతున్న హామీలు నెరవేర్చకపోవడం పట్ల పట్టణంలోని గాంధీ విగ్రహాన్ని వినతి పత్రం అందజేసి తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీ ఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పూజా నరేందర్, మాజీ జెడ్పిటిసి మెట్టు సంతోష్, పోల సుధాకర్, ఈ గంగాధర్, లింబాద్రిగౌడ్, నచ్చు చిన్నారెడ్డి, మీరా శ్రావణ్, అగ్గు క్రాంతి, ఆనంద్, రంజిత్ తదితరులు పాల్గొన్నారు.