అహింస మార్గంలోనే స్వాతంత్ర్యం సిద్ధిస్తుందని ఆచరించిన మహనీయుడు మహాత్మాగాంధీ అని..మహాత్మా గాంధీ బోధనలు నేటికీ అనుసరణీయమని మున్సిపల్ కమిషనర్ కే.రమేష్ కుమార్ కొనియాడారు.మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా గురువారం దుబ్బాక మున్సిపల్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.వారి వెంట మున్సిపల్ మేనేజర్ శ్రీనివాస్,సిబ్బంది,మాజీ కౌన్సిలర్ ఆస యాదగిరి,మాజీ కో ఆప్షన్ సభ్యులు ఆస స్వామి,బీఆర్ఎస్ నాయకులు అధికం బాలకిషన్ గౌడ్,పర్స కృష్ణ పలువురున్నారు.