విజేతగా గండికోట వారియర్స్

నవతెలంగాణ – ఉప్పునుంతల

ఉప్పునుంతల మండలం గట్టుకడిపల్లి గ్రామ సమీపంలో నిర్వహించిన యుపిఎల్ క్రికెట్ టోర్నమెంట్ వారం రోజులుగా కొనసాగుతూ బుధవారం ఫైనల్ మ్యాచ్ లో తలపడిన గండికోట వారియర్స్vs భీమ్ వారియర్స్ తలబడగా గండికోట వారియర్స్ మొదటి ప్రైజ్ విజేతగా నిలిచి, రెండవ ప్రైస్ బీమ్ వారియర్స్ దక్కించుకున్నాయి. ఈ కార్యక్రమాన్ని దాతల సహకారంతో అద్భుతంగా నిర్వహించిన క్రికెట్ టోర్నీ పలువురు అభినందనలు తెలిపారు. క్రికెట్ జట్లకు బహుమతులుగా మొదటి విజేతగా గండికోట వారియర్స్ కు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కట్టా అనంతరెడ్డి, విజేత భీం వారియర్స్ రెండవ బహుమతి గోపిరెడ్డి రఘుపతి రెడ్డి, ట్రోఫీల దాత కట్ట అచ్యుతారెడ్డి టోర్నమెంట్ సహకార దాతలు ఎంపీపీ తిప్పర్తి నరసింహారెడ్డి, కామ్సన్పల్లి మాజీ సర్పంచ్ కర్ణ లక్ష్మీనారాయణ, బోడ శేఖర్, తిరుమలాపూర్ కొట్టే శ్రీను, బయ్య నరేష్, కొట్టే శ్రీను, కలమండల రామస్వామి, గంధసిరి మనోహర్, డిజె స్పాన్సర్ నాగరాజు, గణేష్ ప్లేయర్లకు అన్నదానం దాతలు యారి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నవీన్, శివ, నరేష్ లు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు.