
మండలంలోని పెద్దవూర పోలీస్ స్టేషన్ లో గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మండప నిర్వహకులు,కాలనీవాసులతో శుక్రవారం అవగాహన, సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈసందర్బంగా ఎస్ఐ వీరబాబు ముఖ్య అతిథిగా మాట్లాడుతూ.. గణేష్ చతుర్థి పండుగను భక్తి శ్రద్ధలతో ప్రశాంత వాతావరణంలో ఎలాంటి గొడవలు,ఆటంకాలు లేకుండా జరుపుకోవాలని తెలిపారు. రాత్రి సమయంలో మండపం నిర్వాహకులు మండపం వద్దనే పడుకోవాలని, డీజే లు ఎక్కువ సౌండ్ లో మోతాదులో పెట్టకూడదని, నిమజ్జనం సమయంలో పెద్ద పెద్ద వెహికల్స్, కంటైనర్స్ పెట్టరాదని సూచించారు.గ్రామస్తులకు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగ కుండా సూసుకోవాలని సూ చించారు. వర్షాలు పడుతున్న నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని, అనుమతి కొరకు అప్లికేషన్ ఆన్లైన్ లో సబ్మిట్ చేసి సమాచారం లోకల్ పోలీస్ వారికి ఇవ్వాలని తెలిపారు. వివాదాలు ఉన్న మరియు ప్రజలకు ఇబ్బంది కలిగించే స్థలాలలో ఎలాంటి విగ్రహాలు పెట్టరాదని, బలవంతపు చందాలు వసూలు చేయరాదని, నిమజ్జనం సమయంలో చెరువుల దగ్గర ,లేక్స్ దగ్గర నదుల దగ్గర తగిన జాగ్రత్తలు తీసుకుంటూ నిమజ్జనం చేయాలని కోరారు.