ఒలింపిక్ రన్ ని ప్రారంభించిన గణేష్ బిగాల, బాజిరెడ్డి గోవర్ధన్

నవతెలంగాణ – కంటేశ్వర్
ఒలంపిక్ అసోసియేషన్ అధ్వర్యంలో నిర్వహించిన ఒలంపిక్ రన్ ని రాజా రాజేంద్ర చౌరస్తాలో అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల, రూరల్ ఎమ్మెల్యే ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ తో కలిసి బుధవారం ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణేష్ బిగాల మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా ఒలింపిక్ రన్ కి పెరుగుతున్న ఆదరణ పెరుగుతుంది. ఒలింపిక్ స్ఫూర్తిని, ఒలింపిక్ గేమ్స్ పై అవగాహన పెంచే విధంగా రన్. ఒలంపిక్ రన్ ప్రజలు మానసికంగా ఆరోగ్యంగా దృడంగా ఉంటారు. యువత ఒలింపిక్ రన్ లో పాల్గొనాలని కోరుతున్నాను అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ దండు నీతూ కిరణ్, నూడ చైర్మన్ చామకూర ప్రభాకర్ రెడ్డి, ఒలంపిక్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు ఈగ సంజీవరెడ్డి, బొబ్బిలి నరసయ్య, బీఆర్ఎస్ నాయకులు సుజిత్ సింగ్ ఠాకూర్, సత్య ప్రకాష్, సిర్ప రాజు తదితరులు పాల్గొన్నారు.