గణేష్‌ ఉత్సవాలు శాంతియుతంగా జరుపుకోవాలి

– ఇబ్రహీంపట్నం ఏసీపీ శ్రీనివాస్‌రావు
నవతెలంగాణ-మంచాల
గణేష్‌ ఉత్సవాలు శాంతియుతంగా జరుపు కోవాలని ఇబ్రహీంపట్నం ఏసీపీ శ్రీనివాస్‌రావు అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోనీ దండే టికార్‌ ఫంక్షన్‌హల్‌లో గణేష్‌ ఉత్సవాలపై అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఈ సంద ర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లా డుతూ గ్రామాల్లో గణేష్‌ ఉత్సవాలు శాంతి యుతంగా జరుపుకోవాలని ఏలాంటి అవాంచ నీయమైన ఘటనలు, గొడవలు జరుగకుండా ఉత్సవ కమిటీలు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ముఖ్యంగా గణేష్‌ మండపాలు ఏర్పాటు చేసే నిర్వాహకులు తప్పనిసరిగా పోలీస్‌ స్టేషన్‌లో పర్మిషన్‌ తీసుకోవాలన్నారు.ఈ ఉత్సవాల సందర్భంగా డీజేలకు అనుమతి లేదనీ, చిన్న బాక్సులు ఏర్పాటు చేసుకోవాలన్నారు. గణేష్‌ మండ పాలు ఏర్పాటు చేసేటప్పుడు , నిమర్జనం చేసేట ప్పుడు పోలీస్‌ స్టేషన్‌లో సమాచారం ఇవ్వాలన్నారు. గణేష్‌ నిమర్జనం 11వ రోజుననే చేయాలని వెల్లడించారు. గణేష్‌ ఉత్సవాల సందర్భంగా ఎలాంటి గొడవలు జరుగకుండా గ్రామంలో ప్రజాప్రతినిధులు, గ్రామపెద్దలు, ఉత్సవ కమిటీలు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మోటివేషన్‌ నిపుణులు చైతన్యరెడ్డి, మంచాల సీఐ కాశీనాథ్‌, ఇబ్రహీంపట్నం సీఐ రామకృష్ణ, మంచాల ఎస్‌ఐ రవినాయక్‌, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, గణేష్‌ ఉత్సవ కమిటీల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.