మద్యం రహితంగా గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలి

Ganesh festivals should be celebrated without alcohol– భైంసా లో కొత్త ట్రెండ్ సృష్టిద్దాం 

– ఎ. ఎస్. పి. అవినాష్ కుమార్ 
నవతెలంగాణ – భైంసా
ఈసారి గణేష్ ఉత్సవాల్లో బైంసాలో కొత్త ట్రెండ్ సృష్టించాలి.. నవతెలంగాణ భైంసా..మద్యం తాగకుండా గణేష్ ఉత్సవాలను జరుపుకోవాలని ఏ ఎస్ పి అవినాష్ కుమార్ సూచించారు. బైంసా పట్టణంలోని కిసాన్ గల్లీలో గురువారం రాత్రి గణేష్ హారతి కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. మద్యం మహమ్మారి అన్నిటికీ హానికరమని, నిమజ్జనోత్సవాల రోజు నియమ నిష్టాలతో వేడుకలు జరుపుకోవాలన్నారు. యువత నిమజ్జోత్సవంలో పాల్గొంటూనే, మళ్లీ లక్ష్య సాధన వైపు అడిగిడాలన్నారు. విద్యతోనే సర్వతోముఖాభివృద్ధి సాధించగలుగుతామని ప్రతి ఒక్కరూ విద్య పట్ల ఆసక్తి పెంచుకోవాలని యువతరానికి సూచించారు. తాను ఐపీఎస్ అయినప్పటికీ సమయం దొరికినప్పుడల్లా చదువుతానన్నారు. మన పెద్దలు సూచించిన మార్గంలో నడిస్తే, గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా జరుగుతాయన్నారు.