విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో గణేష్ నిమజ్జన ఉత్సవాలు

నవతెలంగాణ – ఆర్మూర్  

మండలంలోని ఇస్సపల్లి గ్రామంలో బుధవారం రాత్రి గణేష్ నిమజ్జన ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించినారు.  గ్రామ విశ్వబ్రాహ్మణ సంఘ ప్రతినిధులు వినాయకుడిని వాహనంలో అలంకరించి భక్తి పాటలతో గ్రామ పురవీధుల గుండా ఊరేగింపుగా నిమజ్జన కార్యక్రమం నిర్వహించినారు. ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంఘ ప్రతినిధులు స్థానికులు పాల్గొన్నారు.