
మండలంలోని పార్డి (బి) తో పాటు జూమ్డ్ రాజురా సోనారి,చోండి పల్సి గోడపూర్ గ్రామాలతో పాటు ఆయా గ్రామంలో గ్రామంలో ఆదివారం గణనాథులు నిమార్జనం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. నిమార్జనేశ్వ సందర్భంగా ప్రత్యేకంగా అలకరించినా వాహనాలను తయారు చేసి వివిధ రంగులతో విద్యుత్ దీపాలతో అలకరణతో వాహనాలను ముస్తాబు చేశారు. అనంతరం కర్ర గణేష్ విగ్రహం వద్ద ప్రత్యేకంగా తయారు చేసిన వినాయకుడి కి విగ్రహానికి రథం లో విగ్రహాన్ని ప్రతిష్టించి గ్రామంలోని ప్రధాన విధుల గుండా శోభ యాత్ర ఘనంగా నిర్వహించారు. దింతో గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా కుబీర్ ఎస్ ఐ రవీందర్ ఆధ్వర్యంలో పోలిస్ బందోబస్తు చేపట్టారు. గణేష్ విగ్రహాలు వెళ్లే శోభ యాత్ర మార్గాలను పరిశీలించారు. దింతో కర్ర వినాయకుడి వద్ద 9 రోజులు పూజలు చేసిన లడ్డు,కండువా,కాపీ పెన్ను,పాలక బలపం వంటి తదితర వస్తువులను వేలం పాట వేశారు.ఈ వేలం పాటలో ఫార్డి బి గ్రామానికి చెందిన హతగలే లక్ష్మీ కాంత్ దక్కించుకున్నారు.ఆయనకు సర్వజనిక్ కర్ర గణేష్ మండలి నిర్వహకులు శాలవతో సన్మానించారు.