మండల విద్యాశాఖ అధికారిగా గణేష్ రావు

నవతెలంగాణ- రెంజల్

రెంజల్ మండల విద్యాశాఖ అధికారిగా గణేష్ రావు బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు పిఆర్టియు మండల అధ్యక్ష కార్యదర్శులు తాళ్ల సోమలింగం గౌడ్, సాయి రెడ్డి లు కప్పి పూలమాలలతో స్వాగతించారు. ఈ కార్యక్రమంలో మండల నోడల్ ఉపాధ్యాయులు ఆంజనేయులు, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు రాజేందర్ సింగ్, రహమాన్, కిషోర్ కుమార్, పి ఆర్ టి యు మండల అసోసియేట్ అధ్యక్షులు ఫుల్ అజీమ్ తాహిర్, మండల కార్యదర్శి గోవర్ధన్, గంగారాం, కరీం ,గంగాధర్, మండల విద్యా వనరుల శాఖ సిబ్బంది ఛాయా, గంగాధర్, మోహన్ తదితరులు పాల్గొన్నారు.