నవతెలంగాణ-యైటింక్లయిన్ కాలనీ: 8వ కాలనీ 16 వ డివిజన్ యూత్ కాంగ్రెస్ నాయకులు కుదురుపాక నిఖిల్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ మేనల్లుడు గణేష్ సింగ్ ఠాకూర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా నిఖిల్ మాట్లాడుతు గణేష్ సింగ్ చేసిన సేవా కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయని నేటి యువకులే రేపటి భవిష్యత్ అని యువకులను రాజకీయాల వైపు మళ్లించడానికి ఆయన చేస్తున్న కృషి ఎనలేనిదని కొనియాడారు. ఈ కార్యక్రమంలో 16 వ డివిజన్ కాంగ్రెస్ నాయకులు ఆరెల్లి ప్రశాంత్ గౌడ్, సంగిలేని శ్రీనివాస్, రమేష్ రెడ్డి, మాసూద్ అలీ, క్రాంతి, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.