
డిసెంబర్ 21 నుండి 23 వరకు నిర్మల్ జిల్లా ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన 67వ స్కూల్ గేమ్స్ రాష్ట్ర స్టాప్ బాల్ అండర్-17 పోటీలలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మిట్టపల్లి క్రీడాకారిణి గంగా జమున జిల్లా జట్టు తరఫున పాల్గొని జట్టు బంగారు పతకం సాధించడంలో కీలకపాత్ర పోషించి ఈనెల 10 నుండి 15 వరకు రాజస్థాన్ రాష్ట్రంలోని బికినీర్ లో జరగనున్న జాతీయ పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుశీల్ కుమార్ తెలిపారు.శుక్రవారం పాఠశాలలలో నిర్వహించిన కార్యక్రమంలో జాతీయ పోటీలకు ఎంపికైన క్రీడాకారిని గంగా జమునను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శి సంగీతరావు పాల్గొని క్రీడాకారుని ఉద్దేశించి మాట్లాడుతూ రాజస్థాన్లో జరిగే జాతీయ పోటీలలో తెలంగాణ రాష్ట్ర జట్టును ప్రథమ స్థానంలో నిలపడానికి కృషి చేయాలి అన్నారు.ఈ కార్యక్రమం లో సర్పంచ్ తెలు గణేష్, ఎంపీటీసీ బాలగంగాధర్, ఎస్ఎంసి చైర్మన్ మాస్ పెద్ది శ్రీనివాస్, విడిసి చైర్మన్ గోపు రాజేశ్వర్ , పి ఆర్ టి యు మండల కార్యదర్శి నరేష్ చంద్రం, పిఆర్టియు జిల్లా నాయకులు దయాల్ సింగ్, పాఠశాల ఉపాధ్యాయ బృందం రాజశేఖర్, పోశెట్టి, బాలరాజ్, నిరంజన్, రమాదేవి పాఠశాల వ్యాయమ ఉపాధ్యాయులు మర్కంటి గంగా మోహన్ పాల్గొన్నారు.