యాదవ మహాసభ మండల అధ్యక్షుడిగా గంగాధర్

నవతెలంగాణ  – పెద్దవంగర
తెలంగాణ యాదవ మహాసభ మండల అధ్యక్షుడిగా బొమ్మకల్ గ్రామానికి చెందిన రెడ్డబోయిన గంగాధర్ యాదవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం మండల కేంద్రంలోని సాయి గార్డెన్ లో నిర్వహించిన కార్యక్రమంలో  నూతన కమిటీని జిల్లా అధ్యక్షుడు సూత్రపు రాజు ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. మండల ఉపాధ్యక్షులుగా కేశబోయిన సుభాష్, కూకట్ల వీరన్న, ప్రధాన కార్యదర్శిగా జిట్టి రమేష్, సహాయ కార్యదర్శిగా వల్లంల బిక్షపతి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు గంగాధర్ యాదవ్ మాట్లాడుతూ.. సంఘం బలోపేతానికి తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని చెప్పారు. బీసీల్లో అత్యధిక ఓటు బ్యాంకు కలిగిన యాదవులు అన్ని రంగాల్లో రాణించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం యాదవుల సంక్షేమానికి అధిక నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. తన ఎన్నికకు సహకరించిన జిల్లా, మండల నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం తెలంగాణ యాదవ మహాసభ నూతన సంవత్సర క్యాలెండర్ ను నాయకులతో కలిసి ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు రాసాల సమ్మయ్య, పులుగుల్ల పూర్ణచందర్, కుమారస్వామి, పరమేష్, సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.