అసత్య ప్రచారం మానుకోవాలి: గంగాధర్ 

నవతెలంగాణ- పెద్దవంగర:

మండలంలోని బొమ్మకల్లు గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు కేతిరెడ్డి నిరంజన్ రెడ్డి గ్రామ అభివృద్ది పై చేస్తున్న అసత్య ప్రచారం మానుకోవాలి బీఆర్ఎస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు రెడ్డెబోయిన గంగాధర్ యాదవ్, మండల సీనియర్ నాయకులు పసులేటి వెంకట్రామయ్య అన్నారు. బుధవారం గ్రామంలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. నిన్న గ్రామంలో జరిగిన కాంగ్రెస్ సంకల్ప యాత్రలో నిరంజన్ రెడ్డి అవాస్తవాలు మాట్లాడారని చెప్పారు. ఆయన గ్రామ ప్రజలకు చేసిన అభివృద్ధి శూన్యం అన్నారు. ఎన్నికల అప్పుడే ప్రజలు గుర్తుకు వస్తారా అని ప్రశ్నించారు. ఎస్సీల కోసం ఏం చేశావని నిలదీశారు. భూములు అమ్ముకొని గ్రామాన్ని అభివృద్ధి చేశానని చెప్పడం సరికాదని హితవు పలికారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు సమ్మయ్య గౌడ్, రాంమూర్తి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.