ప్రభుత్వ భూములను పేదలకు పంచి ఇవ్వాలి: గంగారపు శ్రీనివాస్

నవతెలంగాణ – ధర్మసాగర్
ధర్మసాగర్ గ్రామ శివారులోని దేవాదుల పైప్ లైన్ సమీపంలోని ప్రభుత్వ భూమి, పోరంబోకు భూములను  నిరుపేదలకు పంచి ఇవ్వాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు గంగారపు శ్రీనివాస్ స్థానిక తాసిల్దార్ సదానందం గారికి సోమవారం వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమం మండల ఎమ్మార్పీఎస్ పార్టీ మండల అధ్యక్షుడు శాంతి సాగర్ ఆధ్వర్యంలో నిర్వహించగా ఆయన ముఖ్య అతిథిగా పాలన్నీ మాట్లాడారు. సర్వే నెంబర్427/1 లో  12 గుంటలు,428/1లో 0.1 గుంట, అదేవిధంగా పోరంబోకు భూమి సంబంధించి  సర్వే నంబర్ 429లో 2 ఎకరాల15 గుంటల భూమి మొత్తం 2 ఎకరాల 28 గుంటల భూమిని నిరుపేదలైన ప్రజలకు ప్రభుత్వం పంచ్ ఇవ్వాలని  ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ఉద్యమాన్ని చేశారు. ఇట్టి భూమిని కొందరు అక్రమార్కులు జెసిబి లతో చదును చేసి,ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం చేసేందుకు పునుకుంటున్నారని అన్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి, వాటికి హద్దులు నాటి కాపాడాలని సూచించారు. వాటిని వెంటనే అర్హులైన నిరుపేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరారు. లేనిపక్షంలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో  మాదిగ ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి శాంతి సాగర్,ఎంఆర్పిఎస్ మండల నాయకులు పుట్ట దేవయ్య, ఎమ్మార్పీఎస్ మండల నాయకులు చిలుక రాజు,ఎమ్మార్పీఎస్ గ్రామ నాయకులు కొట్టే ఆంటోని,కొట్టే శంకర్ తదితరులు పాల్గొన్నారు.