సంక్రాంతి పూట.. గంగిరెద్దు ఆట

– బసవన్న అడితే బతుకు నడుస్తది
– వలస జీవనం..కనుమరుగైయ్యేనా
నవతెలంగాణ – మల్హర్ రావు
సంక్రాంతి పండుగ అంటేనే గుర్తుకొచ్చేది గంగ్గిరెద్దుల విన్యాసాలు పల్లె,పట్టణాల్లో గంగిరెద్దుల ఆటలు ఆకట్టుకుంటున్నాయి. అయితే ఇటీవల గంగ్గిరెద్దుల కళాకారులు ఈ వృత్తికి దూరంగా ఉంటున్నారు. వ్యవసాయ పంటలు పండిస్తూ సాగుబాట పట్టారు.గంగ్గిరెద్దు అంటే పరమశివుడు నందిగా భావిస్తారు.బారికాయలతో బసవన్నల పూజలందుకుంటూ తనదైన ఆటతో అందరిని ఆకట్టుకుంటుంది. ప్రధానంగా సంక్రాంతి పండుగ వేళా గంగ్గిరెద్దుల సందడి ఎక్కువగా ఉంటుంది.కొన్ని వందల కుటుంబాలు ఇప్పటికి గంగ్గిరెద్దులే పెద్దదిక్కుగా జీవిస్తున్నారు.
ఊళ్లను పంచుకొని..
సాధారణంగా అందరూ ఆస్తులను పంచుకుంటే గంగ్గిరెద్దుల వాళ్ళ మాత్రం ఊళ్లను పంచుకొని ఆఊరి నుంచి ఈఊరి దాకా గంగ్గిరెద్దును ఆడించేందుకు వీళ్లకు హక్కు అన్నట్లుగా ముందే పత్రం రాసుకుంటారు. కొన్ని మండలాలకు, గ్రామాలకు కొన్ని కుటుంబాలు మాత్రమే ఆడించేందుకు హక్కు ఉంటుంది. వాళ్లలో వాళ్ళు రాసుకున్న ఈ పత్రానికి విలువ ఎక్కువే ఎవరైనా తమ హద్దులు దాటి ఇంకొక్కరి పరిధిలోకి వెళ్ళితే జరిమాన చెల్లించాల్సి ఉంటుంది. ఇంట్లో ఆడవాళ్లు బుట్టల్లో పిన్నులు,కాంటలు,బొట్టుబిల్లలు పెట్టుకుని ఊరూరా తిరిగి అమ్ముకోని వస్తారు.ఇలా భార్యాభర్తలు కష్టపడి కుటుంబాన్ని పోషించుకుంటారు.
ఆ కళ తప్పుతుందేమో..
గంగ్గిరెద్దును ఆడించడం ఓ అరుదైన కళ ఒక ఎద్దును మచ్చిక చేసుకొని అది తమ మాటకు, పాటకు అనుగుణంగా ఆడటం చేయడమంటే చాలా క్లిష్టమైనపని. ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన విషయం ఉంది. గుగ్గిరెద్దుకు ఆట నేర్పించడానికి విళ్ళలోనే ప్రత్యేక గురువులు ఉన్నారు.పదేళ్ల కిందట కదిలే పాపన్న దగ్గర గుగ్గిరెద్దును ఇచ్చిండ్రు చిన్న గుడ్డును తెచ్చుకొని సాకిన ఏడాది పాటు ఆట నేర్చుకునేందుకు రూ.25వెలు తీసుకొని నేర్పిస్తారు. ఆట నేర్చిన బసవన్న కుటుంబానికి తిండి పెడతాడు.
వలస జీవనం..
పైన నల్లని కోటు వేసుకొని,కింద తెల్లని దొతి కట్టుకొని నెత్తిన పాత పట్టుచీరను పట్కాగా చుట్టుకొని చేతిలో సన్నాయితో బసవన్నను పట్టుకొని దర్జాగా వచ్చే గంగ్గిరెద్దులోళ్లు జీవితం పైకీ కనిపించెంత దర్జాగా లేదు.ఎక్కడెక్కడికో వెళుతూ వలస జీవనం చేస్తూ..వాడవాడలా తిరుగుతూ గంగ్గిరెద్దును ఆడిస్తేనే వారికి పూట గడుస్తోంది.ప్రస్తుతం గంగ్గిరెద్దులోళ్లు ఎక్కువగా పెద్దపల్లి, వేములవాడ పట్టణాల్లో ఉన్నారు.చిన్నపాటి గుడిసెలు వేసుకోని జోవనం సాగిస్తున్నారు.